హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలోకి దూసుకెళ్లిన కారు..!

W.G: తణుకు పాతఊరులో శనివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొమరవరం వెళ్లే రోడ్డులోని కల్వర్టు వద్ద ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించి వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ రోడ్డుకు మార్జిన్ లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.