హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సత్తెనపల్లిలో పోలీసుల కార్డాన్ సెర్చ్!

PLD: సత్తెనపల్లి రంగా కాలనీలో డీఎస్పీ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. 4గురు సీఐలు, 9 మంది ఎస్‌ఐలు, 90 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లపై నిఘా పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సమయంలో 100 లేదా 110కు సమాచారం ఇవ్వాలని సూచించారు.