హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కియా కంపెనీలో 144 మందికి ఉద్యోగాలు

సత్యసాయి: కౌశలం కార్యక్రమంలో భాగంగా పెనుకొండ కియా మోటార్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 144 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన ఈ డ్రైవ్‌కు 215 మంది యువత హాజరయ్యారని కియా మోటార్స్ హెచ్‌ఆర్ ప్రతినిధి ఆర్. పాపిరెడ్డి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 31 లోగా సంస్థలో రిపోర్ట్ చేయాలని సూచించారు.