హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

ATP: గుత్తి శివారులోని జిల్లా సరిహద్దు వద్ద గల జొన్నగిరి సమీపంలో శుక్రవారం రాత్రి ఐచర్ వాహనం, బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో మహేంద్ర, బాలరాజు అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఇద్దరు యువకులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై జొన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.