హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బావిలో పడిన నక్క..!

KNR: రామడుగు మండలం దత్తోజిపేటలోని ఓ వ్యవసాయ బావిలో పడిన నక్కను అటవీశాఖ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. రైతు భీమనేని మల్లయ్య సమాచారంతో స్పందించిన అధికారులు, శ్రీ లక్ష్మీ జంతు సంరక్షణ శాల నిర్వాహకుడు సుమన్ సహకారంతో నక్కను బావి నుంచి రక్షించారు. అనంతరం దానిని సమీప అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు. అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.