హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీఐ సాధన కమిటీ జిల్లా కార్యదర్శిగా రవీందర్ సింగ్

WNP: సమాచార హక్కు చట్టం సాధన సమితి-2005 వనపర్తి జిల్లా కార్యదర్శిగా అమరచింతకు చెందిన హజారి రవీందర్ సింగ్ ఎన్నికయ్యారు. జాతీయ కార్యదర్శి చంటి ముదిరాజ్ ఆయనను జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రవీందర్ సింగ్ ఎన్నికపై అమరచింత పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.