హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 1079.70 అడుగులుగా, నీటి నిల్వ 44.266 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 1,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అంతే స్థాయిలో నీటిని బయటకు విడుదల చేశామని అధికారులు వెల్లడించారు.