PDPL: ఎలిగేడు మండలం ధూళికట్టలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కొమురయ్య యాదవ్ ఇంటింటికీ వెళ్లి సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీటిని తొలగించాలని సూచించారు. ప్లాస్టిక్, చెత్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్లో వేయాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
సీజనల్ వ్యాధులపై అవగాహన


