NGKL: నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఫిషరీస్-ఆక్వాకల్చర్ బోధనకు అతిథి అధ్యాపక పోస్టు మంజూరైనట్లు ప్రిన్సిపాల్ మదన్‌మోహన్ తెలిపారు. ఫిషరీస్‌లో పీజీ లేదా ఎమ్మెస్సీ జువాలజీలో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు సరిపోతాయి. నెట్, సెట్, పీహెచ్‌డీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. అర్హులు ఆగస్టు 24న మధ్యాహ్నం 12 గంటల్లోపు సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరుకావాలి.
తెలంగాణ
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


