NLG: దేవరకొండ కొత్త బస్టాండ్‌లో దుర్వాసన వెదజల్లుతోంది. నిత్యం బస్టాండ్‌కు వెళ్లే ప్రయాణికులు, కళాశాల విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. పట్టణంలోని ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు 20వ వార్డులో ఉన్న బస్టాండ్ వద్ద నిల్వ ఉండి దుర్వాసనతో పాటు దోమలు విహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
దుర్వాసనతో కొత్త బస్టాండ్.. ఇబ్బందుల్లో ప్రయాణికులు


