హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

SRD: జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు శనివారం ఉదయం 530 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 515.400 మీటర్లుగా నమోదైంది. దిగువకు 380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.483 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.