హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుమందు తాగి వివాహిత సూసైడ్

ASF: అత్తింటివారి కట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సిర్పూర్ (టి) మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల ప్రకారం.. లక్ష్మీపూర్కు చెందిన సరోజకు 18 నెలల క్రితం వివాహం కాగా, భర్త, కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించారు. మనస్తాపంతో పురుగుమందు తాగిన ఆమె మంచిర్యాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.