హైదరాబాద్: 28°C
తెలంగాణ

తనిఖీల్లో కిలో బంగారం స్వాధీనం

RR: కేరళ నుంచి HYDకు తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గల్ఫ్ నుంచి ఓ వ్యక్తి కిలో బంగారాన్ని పాలిథిన్ కవర్‌లో పెట్టుకుని తిరువనంతపురం విమానాశ్రయంలో దిగాడు. దేశీయ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయరనే ఆలోచనతో అక్కడి నుంచి HYD వచ్చి సాదిక్ అనే వ్యక్తికి ఇచ్చాడు. అతడిని అధికారులు తనిఖీ చేయగా బంగారం పట్టుబడింది.