హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరకు రైతులకు చేదు కబురు!

VZM: రేగిడి మండలం సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర పరిశ్రమలో 2027-28 క్రషింగ్‌ సీజన్‌ను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. చెరకు సాగు తగినంతగా లేకపోవడం, సూపర్‌ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రైతులు వచ్చే ఏడాది చెరకు సాగు చేపట్టవద్దని సూచించింది. ఫ్యాక్టరీ భవిష్యత్‌పై రైతుల్లో అయోమయం నెలకొంది.