MHBD: కొత్తగూడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓటాయి గ్రామపంచాయతీ సర్పంచ్ గట్టి రాములు శనివారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
గుండెపోటుతో సర్పంచ్ గట్టి రాములు మృతి


