హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనల ఉల్లంఘన.. బీజేపీ నేతలపై కేసు

ADB: జిల్లాలో పోలీసు చట్టం-30 అమల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నాయకులపై పోలీసులు నిన్న కేసు నమోదు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. నాయీబ్రాహ్మణుల ర్యాలీలో పాల్గొని నిబంధనలు అతిక్రమించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాయల్ శరత్, రాళ్లబండి మహేందర్, మైలారపు సచిన్ సహా మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.