హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మిడ్‌మానేరులో 20.094 టీఎంసీల నిల్వ

SRCL: బోయిన్పల్లి మండలంలోని మాన్వాడ వద్ద మిడ్‌మానేరు జలాశయంలో నీటి నిల్వ 20 టీఎంసీలకు పైగా కొనసాగుతోంది. శనివారం 22 ఉదయం 6 గంటల నమోదుల ప్రకారం జలాశయం నీటిమట్టం 314.84 మీటర్లు కాగా, 20.094 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 16.572 టీఎంసీల నిల్వ ఉండగా, ప్రస్తుతం 3.522 టీఎంసీలు అధికంగా ఉంది. 24 గంటల సగటున 127 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, కొనసాగుతుంది.