హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఉల్లి సాగుకు ప్రోత్సాహం

VKB: జిల్లాలో ప్రభుత్వం ఉల్లి సాగును ప్రోత్సహిస్తోందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి అబ్దుల్ సత్తార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అనుకూల పరిస్థితులున్నాయని, రైతులు ఉల్లి సాగు చేసి అధిక ఆదాయం పొందాలన్నారు. ఎకరాకు రూ.8వేల రాయితీ, ఉల్లి నిల్వకు అవసరమైన నిర్మాణానికి రూ. లక్ష సాయం చేస్తుందన్నారు. గతేడాది రాయితీ పొందిన వారు ఈసారి అర్హులు కాదన్నారు.