హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగపూర్ విద్యా పర్యటనకు ఉప్పల్ హెచ్‌ఎం వాణి ఎంపిక

HNK: కమలాపూర్ మండలంలోని ఉప్పల్ బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వాణి సింగపూర్ విద్యా పర్యటనకు ఎంపికయ్యారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు జరిగే క్షేత్ర సందర్శన, విద్యా మార్పిడి కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాల విద్యా విధానాలు, ఉత్తమ పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు.