హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి'

SRPT: నేరేడుచర్ల మండలం జానలన్నె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని బహుజన సామాజిక కార్యకర్త తక్కెళ్ల నాగార్జున అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సూర్యాపేటలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నంద్ పవారు కలిసి వినతిపత్రం అందజేశారు.