MDK: ఫిట్స్ రావడంతో పొలంలో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట, కుమ్మరిపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. భార్య వినోద తెలిపిన వివరాల ప్రకారం.. నీల శేఖర్(40) మధ్యాహ్నం పశువుల గడ్డి కోసం పొలానికి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో వెతికి చూశారు. అప్పటికే అతడు పొలంలో ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. శేఖర్ అకాల మరణంతో కుమ్మరిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
ఫిట్స్‌తో రైతు మృతి


