KMR: బీబీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. దాడిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,520 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్


