హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: థియేటర్‌లో ఇరుముడి సినిమా వీక్షించిన ఎమ్మెల్యే

NZB: అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు శుక్రవారం రాత్రి నగరంలోని ఓ థియేటర్‌లో 'ఇరుముడి' సినిమాను వీక్షించారు. ఆధ్యాత్మిక భావనతో రూపొందిన ఈ చిత్రాన్ని వీక్షించడం మళ్లీ దీక్షా సమయాన్ని గుర్తుచేసిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు జి. ఆగమయ్య, ఏ. సుదర్శన్, ఏ. శేఖర్, సాయిప్రసాద్, వినయ్, ఎల్.ప్రసాద్ పాల్గొన్నారు.