హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బొప్పాయితో జీర్ణ సమస్యలకు దూరం..!

బొప్పాయి పండులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరిచి, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. రోజూవారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.