నిర్ణీత గడువులోగా రెన్యువల్ ఫీజు చెల్లించడంలో విఫలమైన 15 మంది నమోదిత ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ల రిజిస్ట్రేషన్లను సెబీ రద్దు చేసింది. క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణ, నియంత్రణ నిబంధనల అమలును పకడ్బందీగా కొనసాగించే క్రమంలో ఈ చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇకపై వీరు పెట్టుబడి సలహాదారుల సేవలందించేందుకు అర్హులు కారని సెబీ స్పష్టం చేసింది.
వ్యాపారం
సెబీ కఠిన చర్యలు.. 15 మంది రిజిస్ట్రేషన్ రద్దు


