హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ కేట్ క్రాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం కష్టంగా ఉందని భావోద్వేగానికి లోనైంది. 13 ఏళ్ల కెరీర్‌లో ఆమె మూడు ఫార్మాట్లలో 102 మ్యాచ్‌లు ఆడి 140 వికెట్లు పడగొట్టింది. 'ది హండ్రెడ్ 2026'లో ఆమె సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.