హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్తాన్ ఓ చెత్త టీమ్: స్టువర్ట్ బ్రాడ్

పాకిస్తాన్ టీమ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ జట్టు అత్యంత చెత్తగా ఉందని, ఈ జట్టుపై ఇంగ్లండ్ 3-0 తేడాతో సిరీస్‌ను ఈజీగా క్లీన్‌స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పాడు. ఒకవేళ ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ కోల్పోతే అంతకంటే అవమానం ఇంకోటి లేదంటూ వ్యాఖ్యానించాడు. కాగా, తొలి టెస్టులో ENG విజయం దిశగా సాగుతోంది.