హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇనుప చువ్వలు గొంతులో దిగి చుక్కల దుప్పి మృతి

ASF: రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం చుక్కల దుప్పి ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఆలయంపై నుంచి మెట్ల మార్గంలో కిందికి వస్తున్న దుప్పి దూకే ప్రయత్నంలో అక్కడున్న ఇనుప చువ్వలు గొంతులో దిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.