హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాడ్జీలలో సీఐ ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం: సింగరాయకొండలోని పలు లాడ్జిలలో సీఐ శ్రీహరి ఆకస్మిక తనిఖీలు చేపట్టి రూములు, రికార్డులను పరిశీలించారు. లాడ్జిలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరైన గుర్తింపు కార్డు లేనివారికి గదులు కేటాయించవద్దని లాడ్డీల యజమానులకు స్పష్టం చేశారు. అనుమానస్పదంగా ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.