హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాగునీరు సరఫరా చేయడం వివక్షతకు నిదర్శనం'

KRNL: పెద్దపాడు వార్డులో దళితులకు అర్ధరాత్రి 12 గంటలకు తాగునీరు సరఫరా చేయడం వివక్షతకు నిదర్శనమని కేవీపీఎస్ గౌరవ అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ ఆరోపించారు. సామాజిక శంఖారావంలో భాగంగా చేపట్టిన పాదయాత్రలో ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.