హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారిపైకి ప్రమాదకరంగా చెట్టు కొమ్మలు

ప్రకాశం: చీమకుర్తిలో ఒంగోలు వైపు వెళ్లే రహదారి పక్కన చెట్టు కొమ్ములు విరిగి గాలిలో వేలాడుతూ ప్రమాదకరంగా ఉంది. గతంలో వచ్చిన బలమైన ఈదురు గాలులతో వర్షాలకు చెట్టు కొమ్మలు విరిగి అలాగే ఉన్నాయి. అవి ఎండిపోయి ఎప్పుడు రహదారిపై పడతాయోనని వాహనదారులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి విరిగిన చెట్టు కొమ్మలను తొలగించాలని వారు కోరుతున్నారు.