హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోరంట్లలో ఐఓబీ నూతన శాఖ ప్రారంభం

KRNL: కోడుమూరు (మం) గోరంట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా శాఖను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారులు బ్యాంకు రుణాలు, ఇతర ఆర్థిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ సూచించారు.