హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆహారాన్ని తొందరగా తింటున్నారా..?

ఆహారాన్ని తొందరగా తినడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. ప్రతి ముద్దను బాగా నమిలి తినడం వల్ల లాలాజలం ఆహారంతో కలిసి జీర్ణక్రియ సులభతరం అవుతుంది. అలాగే ఆహారం తినేటప్పుడు టీవీ చూడటం లేదా ఫోన్ వాడటం చేయకూడదు. దీనివల్ల ఎంత తింటున్నామో మనకే తెలియదు. నిదానంగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ఇది అనవసరపు క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.