హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుబాయ్‌లో జిల్లా వాసి మృతి

NRML: ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి సోన్ మండల కేంద్రానికి చెందిన దండగుల గంగయ్య (40) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని తీసుకురావాలని కోరారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.