BDK: పినపాక మండలంలోని తోగ్గూడెం పంచాయతీ గోపాలరావుపేట పాతూరు సెంటర్‌లో పది రోజులుగా నీటి పంపు పనిచేయడం లేదు. దీంతో కాలనీవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ సిబ్బందికి సమస్య తెలిపినా స్పందన లేదని స్థానికులు వాపోయారు. అధికారులు వెంటనే పంపు మరమ్మతు చేసి నీటి సమస్య పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
పది రోజులుగా నీటి కష్టాలు


