KMM: ఏన్కూర్ మండలం నాచారం బ్రిడ్జి నిర్మాణం వద్ద ఇనుప చువ్వలు దొంగిలించిన ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. దొంగిలించిన సామగ్రిని ఆటోలో తరలిస్తుండగా చింతల సాయి గణేష్, కిల్లి వెంకటేష్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 50 కిలోల ఇనుము, ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
ఇనుప చువ్వల దొంగతనం.. ఇద్దరు అరెస్ట్


