హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చిన్న అలవాట్లతోనే పెద్ద మార్పులు!

ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే కేవలం వ్యాయామం, ఆహారం మాత్రమే కాదు.. మన రోజువారి అలవాట్లు కూడా. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఇవి శరీరంలోని అవయవాలను క్రమంగా దెబ్బతీస్తాయి. సరైన సమయానికి నిద్రపోవడం, లేవడం, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించడం వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయి. చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.