హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు ఎస్పీ కన్వెన్షన్ హాల్‌లో మైనం సుజాత మహేష్ దంపతుల కుమార్తె సాయి వర్ష వివాహ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, అనంతలక్ష్మి దంపతులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, బీరెల్లి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.