హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NZB: నవీపేట్ మండలంలోని యంచ సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ADE జి. ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నవీపేట్ సెక్షన్ పరిధిలోని 33 కేవీ ఫీడర్ మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు. దీంతో యంచ, అల్జాపూర్, నందిగాం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.