హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏఈఈ పోస్టులకు 23 నుంచి సీబీటీ పరీక్షలు'

కృష్ణ: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఏఈఈ పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు సీబీటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.