GNTR: ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్‌ను ఓటర్లు ఉపయోగించుకోవాలని జీఎంసీ కమిషనర్ కే. మయూర్ అశోక్ కోరారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్త ఓటు నమోదు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల సవరణకు ప్రత్యేక ప్రచారం: జీఎంసీ కమిషనర్


