హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బెల్ట్ షాపులపై మహిళల సమరం

GNTR: చిన్నకుండ్రపులో బెల్ట్ షాపులను ఎత్తివేయాలని కోరుతూ.. మహిళలు, స్కూల్ చిన్నారులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. 'మన గ్రామం మద్యానికి దూరం.. మద్యరహిత గ్రామాలు గాంధీజీ ఆశయం' అని నినాదాలు చేస్తూ.. గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. పల్లెల్లో బెల్ట్ షాపులు తొలగించి గ్రామాన్ని మద్యరహితంగా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.