హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

 కృష్ణ: ఘంటసాల మండలంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. లంకపల్లిలో రూ.36 లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. మల్లంపల్లి, గోగినేనిపాలెంలో రూ.4.89 కోట్లతో 8.80 కిలోమీటర్ల నూతన తారు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.