హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూలపేట పోర్ట్ వద్ద నిరసన

SKLM: సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్ట్‌లో ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఫోర్ వీలర్స్ వాహన సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. పోర్టులో మినరల్ వాటర్ ట్యాంక్, మెస్ వద్ద వాహనాలు అడ్డంగా పెట్టి ఆందోళన చేశారు. ఇది మూడోసారి నిరసన అని సిబ్బంది తెలిపారు. యాజమాన్యం ఒకరోజు గడువు కోరి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.