హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కిషన్ నాయక్

MHBD: జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా గుగులోత్ కిషన్ నాయక్ నియమించబడ్డాడు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆయనను నియమించి ఉత్తర్వులు జారీ చేసినట్లు శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అసమానతలపై చట్టపరంగా పోరాడేందుకు కిషన్ నాయక్ కృషిచేయాలని సూచించారు.