హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెలవెలబోతున్న జంతు ప్రదర్శనశాల

హన్మకొండలో ఒకప్పుడు కళకళలాడిన కాకతీయ జంతు ప్రదర్శనశాల ఇప్పుడు వెలవెలబోతోంది. పులుల లేక వారాంతంలో కూడా సందర్శకులు రావడంలేదు. గతంలో రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ, తెల్ల పులి శరత్ మృతి, ఆరోగ్యం బాగోక శంకర్, కరీనాలను HYD తరలించడంతో జూకు ఆదరణ తగ్గింది. ఏప్రిల్-జులై మధ్య కేవలం రూ.39.40 లక్షలే వచ్చింది. అయితే, త్వరలో మరో పులిని తెచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు సమాచారం.