ప్రకాశం: కంభంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తూ.. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తదితరాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో విజిబుల్ పోలీసింగ్


