హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేసిన డీఎస్పీ

PLD: సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ ఎమ్.వీ.కే. చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసు ఫైళ్లు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకుంటూ మెరుగైన పోలీసింగ్ అందించాలని సూచించారు.