హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా సురేఖపై గజ్జెల కాంతం ఫైర్

HYD: మంత్రి కొండా సురేఖపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం దాటితే సురేఖకు ఓట్లు రావని, పార్టీ కోసం ఆమె చేసిన పోరాటం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతల కష్టంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీకి ప్రతి నాయకుడు కట్టుబడి ఉండాలని అన్నారు.