హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయుర్వేద విద్యార్థుల ఆందోళన

WGL: అల్లోపతి విద్యార్థుల తరహాలోనే ఆయుర్వేద వైద్య కోర్సులు చదివేవారికీ స్టైఫండ్ పెంచాలని వరంగల్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేశారు. వేయి స్తంభాల గుడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. 2009-16 వరకు ఒకేలా ఉన్నా, రెండేళ్లకోసారి పెరగాల్సిన స్టైఫండ్ నేటికీ పెరగలేదని, 18 రోజులుగా నిరసన చేస్తున్నా స్పందిచడంలేదని, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.